ఉదయాన్నే అల్లం టీ తాగితే నోటికి రుచితో పాటు, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. ముక్కు దిబ్బడగా ఉంటే పడుకునే ముందు వేడి నీళ్లలో నిమ్మరసం, కాసింత చక్కెర కలుపుకొని తాగండి. వేడి పాలలో ఒక టీ-స్పూన్ పసుపు లేదా మిరియాలు కలిపి రోజుకు 1-2 సార్లు తాగితే మంచిది. ఉసిరిలో యాంటిఆక్సిడెంట్స్, విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోజుకో ఉసిరి తింటే జలుబు, దగ్గు సమస్యలు దరిచేరవు. టీ స్పూన్ తేనె, కొంత నిమ్మరసం, చిన్న దాల్చిన చెక్క కలిపిన మిశ్రమాన్ని తాగితే జలుబు, దగ్గు తగ్గుతుంది. జలుబు చేసినప్పుడు చల్లటి నీళ్ళు, జ్యూసులు కాకుండా వేడిగా ఉన్న పదార్థాలను తీస్కోవడం మంచిది. గోరు వెచ్చని నీళ్ళలో కాసింత ఉప్పు వేసి పుక్కిలించడం వల్ల గొంతులోని వైరస్ తొలగిపోతుంది. వేడి నీళ్ళలో రెండు చుక్కల యుకలిప్టస్ ఆయిల్‌ను వేసి ఆవిరి పట్టుకుంటే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. జలుబు చేసినప్పుడు గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల గొంతులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గిపోతుంది. అల్లం రసంలో కొన్ని తులసి ఆకులు, తేనె కలిపి రోజుకు 2-3 సార్లు తాగితే జలుబు దరిచేరదు.