చపాతీపై నెయ్యి రాసుకుని తింటే ఆరోగ్యమేనా? పంజాబ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం నెయ్యి లేనిదే చపాతీ తినరు. అయితే ఇలా నెయ్యితో చపాతీ తినడం ఆరోగ్యకరమేనా? పోషకాహార నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చపాతీపై నెయ్యి పూసుకుని తినడం ఆరోగ్యకరమే. రోజుకు ఒక స్పూను నెయ్యి తినడం వల్ల ఎంతో మంచిది. తినే చపాతీలకు ఈ స్పూను నెయ్యిని సర్దుకుంటే మంచిది. రోటీ లేదా చపాతీకి నెయ్యి రాయడం వల్ల వాటి రుచి కూడా పెరుగుతుంది. నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతాము అనుకుంటారు కానీ, నిజానికి నెయ్యి వల్ల బరువు తగ్గుతారు. అలా బరువు తగ్గాలంటే రోజుకో నెయ్యి స్పూను మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. చపాతీలోని గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించడానికి నెయ్యి సహాయపడుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు.