ఉడకబెట్టిన గుడ్లు - మూడు
పచ్చిమిర్చి - రెండు
టమోటోలు - ఒకటి
కారం - అరస్పూను
పసుపు - పావు స్పూను
ఛాట్ మసాలా - అర స్పూను
కరివేపాకులు - గుప్పెడు
ఉప్పు - తగినంత
పుదీనా తరుగు - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
నూనె - రెండు స్పూనులు
గుడ్డులోని చందమామను పొడిలా చేసుకోవాలి, తెల్ల భాగాన్ని చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
నూనె వేడెక్కాక పచ్చిమిర్చి తరుగు, కరివేపాకులు, టొమాటో తరుగు వేసి వేయించాలి.
అవి బాగా వేగాక కారం, పసుపు, ఛాట్ మసాలా, ఉప్పు వేసి కలపాలి. కాస్త నీళ్లు కూడా వేసి మూత పెట్టాలి.
కూరలా మగ్గాక అందులో పుదీనా, కొత్తిమీర తురుము వేసి కలపాలి.
తరువాత పొడిలా చేసుకున్న చందమామను వేసి కలపాలి. చివర్లో తెల్లగుడ్డు ముక్కల్ని కూడా వేసి కలపాలి.
టేస్టీ ఎగ్ ఛాట్ రెడీ అయినట్టే.