బ్రూస్ లీ మరణ మిస్టరీ వీడిపోయింది లెజెండరీ మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్ లీ మరణానికి సంబంధించి దశాబ్దాలుగా సస్పెన్స్ కొనసాగుతోంది. బ్రూస్ లీ కేవలం 32 సంవత్సరాల వయసులోనే 1973లో కన్నుమూశారు. ఆయన ఎందుకు, ఎలా మరణించారనే దానిపై అప్నట్నించి మిస్టరీగా మారింది. ఆ మిస్టరీ చేధించారు పరిశోధకులు. బ్రూస్ లీ హైపోనాట్రేమియా సమస్య కారణంగా చనిపోయినట్టు తేల్చారు. ఈ సమస్య వల్ల ఆయన కిడ్నీలు నీటిని విసర్జించడంలో విఫలమయ్యాయి. ఆయన చనిపోవడానికి ముందు రోజుల్లో రోజుకు పది నుంచి ఇరవై సిరామిక్ బాటిల్ సేక్ తాగేవాడని వాదన. సేక్ అనేది ఒక జపాన్ ఆల్కహాల్ ద్రావకం.