ఈ ఆకులు అన్నంలో వేసి వండితే బాస్మతి ఘుమఘుమలు బిర్యానీకి అంత రుచి రావడానికి ప్రధాన కారణం బాస్మతి రకం బియ్యం. సాధారణ బియ్యానికి కూడా బాస్మతి సువాసనను అందిస్తాయి ‘పాండన్ ఆకులు’లేదా ‘అన్నపూర్ణ ఆకులు’. సౌత్ ఈస్ట్ ఏషియన్ వంటకాల్లో ఈ ఆకులు ప్రాచుర్యం పొందాయి. ఈ ఆకులు సహజంగానే సువాసనను కలిగి ఉంటాయి. ఉడుకుతున్న అన్నంలో ఈ ఆకులను వేస్తే ఆ అన్నమంతా బాస్మతిలా ఘుమఘుమలాడుతుంది. ఈ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు , విటమిన్లు కూడా అధికంగా ఉన్నాయని అంటారు. ఈ ఆకులలో ఉండే పోషకాహారం కారణంగా, ఈ ఆకులను నొప్పి, జ్వరాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. మలబద్ధకం చికిత్సకు ఆయుర్వేద మందులలో ఈ ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులు చర్మ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి.