కాస్తయినా వ్యాయామం చేస్తే చాలు మెదడు పనితీరు పదికాలాలు పదిలంగా ఉంటుందట.

రోజుకు కనీసం 4000 అడుగులు నడిస్తే చాలు గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

రోజూ వాకింగ్ చేసే వారి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం నివారించబడుతుంది.

రోజూ కాసేపు నడకకు కేటాయిస్తే శరీరంలో హాప్పీ హార్మోన్లు విడుదలవుతాయి. ఒత్తిడి తగ్గి ఉల్లాసంగా ఉంటుంది.

నడక వల్ల శరీరంలో మానసిక స్థితిని అదుపు చేసే సెరోటోనిన్ స్థాయి పెరుగుతుంది. భావోద్వేగాలు అదుపులో ఉంటాయి.

నడక.. ఎముకలు, కీళ్ల ఆరోగ్యాని మేలు చేస్తుంది.

వ్యాయామం లేకపోతే మెదడు మొద్దుగా మారుతుందట. నడక న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలను కలిగించి.. చురుగ్గా ఉంచుతుంది.

రోజూ కనీసం 30 నిమిషాల నడక వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. మెదడు వాల్యూమ్ కూడా పెరుగుతుందట.

క్రమం తప్పకుండా ప్రతి రోజూ వాకింగ్ చేసే వారిలో నిద్ర నాణ్యత పెరుగుతుందట. ఇది స్లీప్ సైకిల్ ను క్రమబద్ధీకరిస్తుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels