పాప్‌కార్న్ మన ఆరోగ్యానికి మంచిదేనా? స్నాక్స్ అనగానే మనకు మొదట గుర్తు వచ్చేది పాప్‌కార్న్. పాప్‌కార్న్ బడ్జెట్ ఫ్రెండ్లీ, హెల్తీ స్నాక్స్ ఎంపిక. పాప్‌కార్న్‌లో ఫైబర్ ఉంటుంది, అది మీ జీర్ణ శక్తి మెరుగుపరుస్తుంది. బటర్ తక్కువ ఉన్న పాప్‌కార్న్‌లో కాలరీలు తక్కువగా ఉంటాయి. కడుపు నిండా తిన్నా కూడా బరువు పెరగరు. విటమిన్-బి, మినరల్స్, ఫైబర్ వీటిలో కలిగి ఉంటాయి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా పాప్‌కార్న్ తినచ్చు. ఇది త్వరగా మీ కడుపు నింపుతుంది. దాంతో వేరే చిరు తిండ్లకు దూరంగా ఉంటారు.