శారీరక, మానసిక ప్రయోజనాలను అందించడంలో నిద్ర చేసే మేలు అంతా ఇంతా కాదు.

కాబట్టి నిద్ర అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమైన, అవసరమైన ప్రక్రియ.

ఇది కొన్ని జబ్బులను దూరం చేయడంతో పాటు మానసికంగా హాయిగా ఉండేలా చేస్తుంది.

నిద్ర విషయానికి వస్తే మగవారికంటే ఆడవారికి ఓ అరగంట ఎక్కువ నిద్ర అవసరమట.

అవును తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం ఈ విషయం తెలిపింది.

ఆడవారు మల్టీ టాస్కింగ్ పనులు చేయడానికి ఇది హెల్ప్ చేస్తుందని తెలిపింది.

కానీ కొందరు ఆడవారు నిర్దేశించిన దానికన్నా తక్కువగా పడుకుంటారు.

ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తుందట. (Images Source : Unsplash)