తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గుముఖం పడుతోంది.



గజగజ వణికిపోయిన జనాలు ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.



ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఏర్పడిన పొడిగాలులు కర్ణాటకవైపు వెళ్లిపోవడంతో చలి తీవ్రత తగ్గింది.



ఇన్ని రోజులు పొడిగాలులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నందున రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.



విశాఖ నగరంతోపాటుగా నగర పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్లలో ప్రస్తుతం 20 డిగ్రీల సెల్సియస్‌కి పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.



తెలంగాణలో పరిస్థితి చూస్తే తొమ్మిది పది జిల్లాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో చలి తీవ్రత తక్కువగానే ఉంది.



నిన్న తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత 32.4 డిగ్రీలు ఖమ్మంలో నమోదు అయింది.



తక్కువ ఉష్ణోగ్రత 8.5 డిగ్రీలు ఆదిలాబాద్‌లో రిజిస్టర్ అయింది.