వారం రోజుల పాటు చలికి వణికిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ చాలా రిలీఫ్‌



ఇవాళ్టి నుంచి చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గుముఖం పడుతుందని అంచనా



తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పొడిగాలులు క్రమంగా కర్ణాటక వైపు కదులుతున్నాయి.



మరో 24 గంటల పాటు హైదరాబాద్‌ మినహా మిగిలిన ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది.



ఈ సాయంత్రం నుంచి తెలంగాణలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది.



హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పది నుంచి పదిహేను డిగ్రీలు మధ్య నమోదు అయ్యే అవకాశం ఉంటుంది



కోస్తాంధ్ర, గోదావరి జిల్లాల్లో కూడా చలి తీవ్రత తగ్గుముఖం పడుతుంది.



పొడిగాలుల ప్రభావంతో విశాఖ, దాని పరిసరప్రాంతాల్లో 12 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.