చలి కాలంలో చాలామంది జుట్టు రాలే సమస్య తీవ్రమవుతుంది. దీనికి నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలు.

జుట్టుకు తరచుగా నూనె రాస్తుండాలి. నూనె జుట్టుకు పోషణను ఇస్తుంది. జుట్టు పొడిబారకుండా ఉంటుంది.

తలస్నానం ఎక్కువ చెయ్యకూడదు. ఎక్కువైతే జుట్టును పొడిబారేలా చేసి జుట్టు రాలేందుకు కారణం అవుతుంది.

చలికాలంలో కెమికల్స్ ఉన్న షాంపూలు, కండిషనర్లు వాడకూడదు. జుట్టు నుంచి సహజమైన నూనెలు పోవడం వల్ల మరింత రాలిపోవచ్చు.

ఈ కఠినమైన వాతావరణ పరిస్థితుల నుంచి జుట్టును కాపాడుకునేందుకు మంచి క్వాలిటీ సీరం వాడాలి.

ఎసెన్షియల్ ఆయిల్స్, అలోవెరా జెల్ ఉపయోగించి సీరం ఇంట్లోనే తయారు కూడా చేసుకోవచ్చు.

చలికాలంలో వీలైనంత వరకు హీట్ స్టయిలింగ్ టూల్స్ వాడకూడదు. ఇవి జుట్టు మరింత పొడి బారేందుకు కారణం అవుతాయి.

జట్టు ఆరోగ్యంగా పెరగాలంటే తప్పకుండా పోషకాహారం తీసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు, గింజలు ఆహారంలో భాగం చేసుకోవాలి.

జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు క్రమం తప్పకుండా ట్రిమ్మింగ్ చేసుకుంటూ ఉండాలి.

జుట్టును పొడి గాలి నుంచి కాపాడుకునేందుకు క్యాప్ లేదా స్కార్ఫ్ ను ఉపయోగించాలి.

Representational Image : Pexels