శీతాకాలంలో జీవక్రియల వేగం తగ్గడం వల్ల సులువుగా బరువు పెరుగుతారు. వెచ్చని డ్రింక్స్‌తో బరువు తగ్గొచ్చట. జీవక్రియల వేగం పెంచే అల్లం టీతో శరీరం మరింత శక్తి సంతరించుకుంటుంది. దాల్చీని, నిమ్మతో కలిపి తీసుకోవచ్చు. రోజు ఒక గ్లాసు దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాదు విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఉదయాన్నే తీసుకోవాలి. ఈ పానీయంతో జీవక్రియల వేగం పెరుగుతుంది. చక్కెర చేర్చని గ్రీన్ టీ తాగితే బరువు తగ్గడం మాత్రమే కాదు ఇమ్యూనిటీ కూడా మెరుగు పడుతుంది. బాదం పాలు బరువు తగ్గేందుకు మంచి ఆప్షన్. తక్కువ క్యాలరీలు కలిగిన వీటితో టీ తయారు చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. Images courtesy : Pexels