చలికాలంలో పాదాలు పొడి బారుతున్నాయా?

చలికాలంలో చర్మం, పెదాలు, పాదాలు పగులుతాయి.

ఈ సమస్య నుంచి కొన్ని వంటింటి చిట్కాలతో బయటపడవచ్చు.

గోరు వెచ్చని నీటిలో ఓట్ మీల్ వేసి అందులో పాదాలు ఉంచడం వల్ల మృదువుగా మారుతాయి.

పొడిబారిన పాదాలకు కొబ్బరి నూనె మసాజ్ చేయడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు.

పొడి పాదాలపై అరటిపండు, తేనె కలిపిన గుజ్జును రాయడం వల్ల తేమగా మారుతాయి.

రాత్రిపూట పెట్రోలియం జెల్లీని పూయడం వల్ల పగిలిన మడమలు నయం అవుతాయి.

తేనె, బాదం నూనె కలిపి పాదాలకు పూస్తే పాదాలు మృదువుగా మారుతాయి.

నిమ్మతొక్కను ఉప్పులో కలిపి పాదాలకు రుద్దడం వల్ల పాదాలు సున్నితంగా మారుతాయి.

అలోవెరా జెల్ రుద్దడం వల్ల పాదాలు అందంగా మారతాయి.

గ్లిజరిన్, రోజ్‌వాటర్‌ ను కలిపి పాదాలకు అప్లై చేస్తే మృదువుగా మారుతాయి.

All Photos Credit: Pixabay.com