ఒత్తిడి, కాలుష్యం, హార్మోన్ల అసమతుల్యత ఇలా అనేక కారణాలతో జుట్ట సమయానికి ముందే నెరిసిపోతోంది. ఈ సమస్యకు సింథటిక్ డై లు వినియోగించడం కంటే సహజ పదార్థాల సహజ చికిత్సా పద్ధతులు పాటించడమే మంచిది. కరివేపాకు తెల్ల జుట్టు నివారిని. దీనిలో విటమిన్లు ఎ, సి ఉంటాయి. జుట్టు బలంగా పెరిగేందుకు కూడా దోహదం చేస్తుంది. గుమ్మడి, పొద్దుతిరగుడు, నువ్వు గింజలను చేర్చుకుంటే రాగి, సెలీనియం, ఐరన్, జింక్ కాల్షియం శరీరానికి అందుతాయి. ప్రొటీన్, మాంగనీస్, సెలీనియం, పోటాషియం కలిగిన కొబ్బరి జుట్టుకు మంచి పోషణను ఇస్తుంది. గులాబి, మందార పూరేకులను నీడన ఆరబెట్టి వాటితో ప్రతి రోజూ టీ కాచుకుని తాగితే జుట్టు సమస్యలు మాయమవుతాయి. ఉసిరిలో విటమిన్ సి పుష్కలం. మాడుకు రక్త ప్రసరణ మెరుగు పరుస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మునగాకు యాంటీఆక్సిడెంట్లతో బలమైన ఆహారం. దీనితో శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. జుట్టు నల్లగా ఆరోగ్యంగా పెరుగుతుంది. బృంగరాజ్, బ్రహ్మీ వంటివి కూడా జుట్టు ఆరోగ్యానికి బాగా ఉపకరిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. Images courtesy : Pexels and Unspalsh