మునగాకు టాబ్లెట్లు ఇప్పుడు చాలా ప్రాచూర్యంలో ఉన్నాయి. మునగాకు సుగుణాలన్నీ ఈ మాత్రలతో శరీరానికి అందుతుందట. మునగాకు పోషకాల భరితం. ఇందులో విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో నిరోధక శక్తి పెంపొందుతుంది. నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. మునగాకులో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాల వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గుతుంది. డయాబెటిస్, హైకొలేస్ట్రాల్ వంటి పరిస్థితులను అదుపులో పెట్టేందుకు మునగాకు చాలా మంచి పాత్ర పోషిస్తుంది. మార్కెట్ లో రకరకాల బ్రాండ్లలో ఈ మునగ టాబ్లెట్లు, పొడి అందుబాటులో ఉన్నాయి. Images courtesy : Pexels