శీతాకాలంలో బీపీ పేషెంట్లలో బీపీ పెరిగిపోవడం చాలా సాధారణం. కానీ బీపి అదుపులో పెట్టుకోవడం అవసరం.

చల్లని వాతావరణంలో రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.

కొన్ని డ్రైఫ్రూట్స్ క్రమం తప్పకుండా తినడం వల్ల బీపి అదుపులో ఉంటుంది. బీపీ లక్షణాలను కూడా తగ్గుతాయి.

జీడిపప్పుల్లో సోడియం తక్కువ, పోటాషియం ఎక్కువగా ఉంటుంది. బీపీ తగ్గుతుంది. గుండెను కాపాడుతాయి.

పిస్తా పప్పుల్లో ఫైబర్ ఎక్కువ, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. రెండూ కలిసి బీపీ తగ్గేందుకు దోహదం చేస్తాయి.

బాదాముల్లో ఆల్పా టోకోఫెరాల్ ఉంటుంది. ఇది బీపిని అదుపు చేస్తుంది.

అక్రూట్ లో జింక్, కాల్షియంతో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇవి బీపి అదుపు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

అంజీర్ లో ఉండే పొటాషియం బీపిని అదుపులో పెట్టేందుకు తోడ్పడుతుంది.

ఎండు ద్రాక్షలో పొటాషియం ఎక్కువ కనుక బీపీని అదుపు చేస్తాయి.
Images credit : Pexels