డయాబెటిక్స్ లో కాస్త అజాగ్రత్తతో కూడా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని మీకు తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా 20 -74 సంవత్సరాల మధ్య వయస్కుల్లో అంధత్వానికి మొదటి కారణం డయాబెటిస్.

రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకపోవడం వల్ల చాలా మంది కంటి చూపు కోల్పోవాల్సి వస్తోంది.

ఎలాంటి పరిస్థితులు డయాబెటిక్స్ లో అంధత్వానికి దారితీస్తాయో తెలుసుకుందాం.

అకస్మాత్తుగా చూపు మసకబారితే వెంటనే కళ్లజోడు మార్చేయ్యాలని అనుకోవద్దు . ఇది రక్తంలో పెరిగిన షుగర్ లెవల్స్ వల్ల కావచ్చు.

రక్తంలో చక్కెర స్థాయి పెరిగినపుడు కంటిలోని లెన్స్ లో వాపు రావడం వల్ల చూపు మసకబారొచ్చు.

చూపు మందగించడానికి మరో కారణం కంటి శుక్లాలు. డయాబెటిక్స్ లో కంటిలో శుక్లాలు చాలా త్వరగా ఏర్పడవచ్చు.

డయాబెటిక్స్ లో గ్లకోమా వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ.

చాలా అరుదుగా నియోవాస్క్యూలార్ గ్లకోమా అనే కంటి సమస్యకు ఆస్కారం ఉంటుంది.

అదుపులో లేని షుగర్ వల్ల కళ్లలోని చిన్న చిన్న రక్తనాళాలకు నష్టం జరగడం వల్ల డయాబెటిక్ నెఫ్రోపతి అనే పరిస్థితి ఏర్పడుతుంది.

Images courtesy : Pexels