కొన్ని రకాల పదార్థాలు ఉదయాన్నే మొదటి ఆహారంగా తీసుకుంటే రోజంతా శక్తిమంతంగా ఉండొచ్చు.

మనం తీసుకునే ఆహారం మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఉదయాన్నే ఏం తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.

రకరకాల కూరగాయలు ఉపయోగించి చేసే జ్యూస్ లు ఉదయం పరగడుపునే తీసుకుంటే ఆరోగ్యానికి చాలి మంచిది.

రాత్రంతా నీళ్లలో నానబెట్టిన గింజలను ఉదయాన్నే తింటే రోజంతా జీర్ణక్రియ సజావుగా ఉండేందుకు, పోషకాల శోషణఖు ఉపకరిస్తుంది.

ఉదయాన్నే అరటి పండు తింటే శరీరం శక్తి సంతరించుకుంటుంది. బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.

రాత్రంతా సొంపు నీటిలో నానబెట్టి ఉంచి ఆ నీళ్లు ఉదయాన్నే తాగితే బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలు ఉండవు.

ఎండు ద్రాక్ష, అంజీర వంటి డ్రైఫ్రూట్స్ రాత్రంతా నానబెట్టి తింటే శక్తిమంతంగా ఉండడమే కాదు జీర్ణక్రియ సాజావుగా జరుగుతంది.

పండ్ల రసాలు కూడా ఉదయం మొదటి ఆహారంగా తీసుకోవచ్చు. శరీరం నుంచి మలినాలు తొలగి పోతాయి.

పరగడుపున బొప్పాయి పండు తింటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి.

Images credit : Pexels