శరీరంలో నుంచి వ్యర్థాలు, టాక్సిన్లను బయటకు పంపే అతి ముఖ్యమైన ప్రక్రియ విసర్జన క్రియ.

మలబద్దకం అన్ని రకాల వ్యాధులకు కారణం కాగలదు. కనుక దాన్ని వదిలించుకునే చిట్కాలు కొన్ని తెలుసుకుందాం.

చియా సీడ్స్, నిమ్మకాయ నీళ్లతో కలిపి తీసుకుంటే మలబద్దకాన్ని నివారించవచ్చు.

సైలియం హస్క్ ఒక టేబుల్ స్పూన్ 150 మి.లీ. ల నీటితో కలిపి తీసుకుంటే ఫలితం బావుటుంది.

జీర్ణవ్యవస్థ బాగా సున్నితంగా ఉండే వారు దీన్ని ఒక టేబుల్ స్పూన్ తో మొదలుపెట్టి క్రమంగా పెంచుకోవచ్చు.

ప్రతి రోజూ క్రమం తప్పకుండా స్క్వాటింగ్ దీనినే యోగా లో మలాసన సాధన చెయ్యడం వల్ల మలబద్దకాన్ని నివారించవచ్చు.

పొట్టమీద సున్నితంగా మసాజ్ చెయ్యడం ద్వారా కూడా మలబద్దకం తగ్గుతుంది.

Images credit : Pexels