అవిసెగింజలు ప్లాక్స్ సీడ్స్ అనే పేరుతో ప్రాచూర్యంలో ఉన్నాయి. ఇవి చాలా పుష్టికరమయిన ఆహారం.

అవిసె గింజల్లో గణనీయమైన ప్రొటీన్, పైబర్, ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్స్ లభిస్తాయి.

అవిసె గింజలు తీసుకున్నపుడు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. అందువల్ల తీసుకునే క్యాలరీల సంఖ్య తగ్గుతుంది.

అవిసెగింజలు తీసుకున్నపుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. టైప్2 డయాబెటిక్స్ కి మంచి పోషణ.

అవిసెగింజలతో చేసిన పదార్థాలు తీసుకున్నపుడు సిస్టోలిక్, డయోస్టోలిక్ బీపీ అదుపులో ఉంటుంది.

ప్రతిరోజూ 4 టేబుల్ స్పూన్ల వేయించిన అవిసెగింజలు తీసుకున్నపుడు 15 శాతం కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపు చేస్తుంది.

అవిసెగింజల్లో ఉండే లిగ్నాన్స్, ఇతర ప్లాంట్ కాంపౌండ్స్ లో యాంటీ క్యాన్సరస్ లక్షణులు ఉంటాయి.

Images credit : Pexels