కొన్ని రకాల ఆహార పదార్థాలు కలిపి తీసుకోకూడదని ఆయుర్వేదం చెబుతోంది. అవేమిటో తెలుసుకుందాం.

బ్రెడ్ వంటి ఈస్ట్ కలిగిన ఆహారాలు పాలతో కలిపి తీసుకుంటే విరుద్ధ ఆహారం అవుతుందని ఆయుర్వేదం చెబుతోంది.

పాలు నువ్వులు కలిపి తీసుకుంటే జీర్ణసమస్యలు వస్తాయి.

అరటి పండు, పాలు కలిపి తీసుకుంటే శరీరంలో టాక్సిన్స్ ఏర్పడవచ్చు. కనుక రెండు కలిసి తీసుకోవద్దు.

చేపలు పాలు కూడా కలిపి తీసుకోవద్దు. ఇలా తీసుకున్నపుడు అజీర్ణం మాత్రమే కాదు ఇతర అనారోగ్యాలు కూడా ఏర్పడవచ్చు.

ఆకు కూరలను పాలతో కలిపి తీసుకోవద్దు. ఈ కూరగాయల్లో ఉండే ఆక్సలేట్లు కాల్షియం శోషణకు అంతరాయం కలిగిస్తాయి.

పాలతో ముల్లంగి కలిపి తీసుకుంటే జీర్ణం కావడంలో ఇబ్బందులు ఏర్పడి జీర్ణసంబంధ వ్యాధులు వస్తాయి.

బత్తాయి, నారింజ వంటి పుల్లని పండ్లను పాలతో కలిపి తీసుకుంటే జీర్ణసమస్యలు తలెత్తుతాయి.

Images courtesy : Pexels