షుగర్‌తో ఇబ్బంది పడేవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పొరపాటు చేసినా రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. అయితే మధుమేహం ఉన్నవారు వేరుశెనగ తినొచ్చా? లేదా? పల్లీలు ప్రోటీన్, విటమిన్ బి6, బి9, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. కాబట్టి ఉదయాన్నే వేరుశెనగ తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుందట. డయాబెటిక్ పేషెంట్లు పల్లీలు తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీనివల్ల ఫుడ్ కంట్రోల్లో ఉండి.. సులభంగా బరువు తగ్గుతారు. వీటిని తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. గుండె సమస్యలు దూరమవుతాయి. (Images Source : Unsplash)