కొత్తిమీర అనగానే చాలామంది ముఖం అదోలా పెట్టుకుంటారు. దాన్ని పక్కకు తీసిపడేస్తారు.

అయితే, కొత్తిమీర ఆరోగ్యానికి చాలామంచిది. దాన్ని పాడేయడం వల్ల మీరు చాలా పోషకాలు కోల్పోతున్నారు.

కొత్తిమీర చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

కాలేయం సక్రమంగా పనిచేయడానికి కొత్తిమీర పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

డయాబెటిస్ బాధితులకు కొత్తిమీర చాలామంచిది. ఇన్సులిన్ స్రవించేందుకు సహకరిస్తూ.. షుగర్ స్థాయిలు తగ్గిస్తుంది.

కొత్తిమీరలో ఉన్న విటమిన్-K అల్జీమర్స్ నుంచి కాపాడుతుంది.

కొత్తిమీరలో యాంటీ సెప్టిక్ ప్రోపర్టీస్ ఎక్కువ. మౌత్ అల్సర్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కంటి సమస్యలున్నవారికి కొత్తిమీర చాలామంచిది. కండ్ల కలక నుంచి ఉపమనం ఇస్తుంది.

నాడీవ్యవస్థను యాక్టీవ్‌గా ఉంచడంలో కొత్తిమీరకు తిరుగులేదు. జ్ఞాపకశక్తి పెంపొందిస్తుంది.

Images and Videos: Pexels and Pixabay