చాలా పండ్లలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. కనుక కడుపు నిండుగా ఉండి బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి.

ఆపిల్స్ లో క్యాలరీలు తక్కువ. ఫైబర్ ఎక్కువ. కడుపు నిండిన భావన కలిగించి బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి.

బెర్రీలలో క్యాలరీలు తక్కువ. రకరకాల విటమిన్లు పోషకాలు ఉంటయి. కొలెస్ట్రాల్, బీపీ, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి.

పీచ్, రేగు వంటి స్టోన్ ఫ్రూట్స్ లో క్యాలరీలు తక్కువ. చిప్స్, కుకీస్ వంటి స్నాక్ కి బదులుగా వాడుకోవచ్చు.

కృష్ణ ఫలం తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ కలిగిన పండు. బీపీ, షుగర్ లను అదుపు చేస్తుంది.

రేవల్చిని అనే రబర్బ్ ఫలం బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది.

కివిల్లో పోషకాలు ఎక్కువ. ఫైబర్ కలిగి ఉండే ఈ పండ్లు శారీరక బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.

పుచ్చకాయల్లో క్యాలరీలు తక్కువ. నీళ్లు ఎక్కువగా ఉండే ఈ పండ్లు బరువు తగ్గేందుకు శరీరం హైడ్రేటెడ్ గా ఉండేందుకు తోడ్పడుతాయి.

నారింజల్లో విటమిన్ సి, ఫైబర్ ఎక్కువ. వీటితో కడుపు నిండుగా అనిపించి బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి.

అరటి పండ్లలోని పోషకాలు, ఫైబర్ వాటిని ఆరోగ్యకరమైన బరువు తగ్గించే ఆహారంగా మార్చాయి.
Images courtesy : Pexels