తియ్యని రుచితో ఉండే దుంపలు చిలగడదుంపలు చాలా పౌష్టికాహారం. ఇందులో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం.

ఇందులో ఉండే బీటా కెరోటిన్ వల్ల ఇవి ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. ఇమ్యూనిటి బలపరచడంలో బీటాకెరోటిన్ ప్రత్యేక కారణం అవుతుంది.

తియ్యగా ఉన్నప్పటికీ వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కనుక రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రిస్తాయి..

చిలగడదుంపల్లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ శీతాకాలంలో శరీరానికి అవసరమయ్యే అధిక శక్తిని నిరంతరాయంగా విడుదల చేస్తాయి.

వీటిలో ఉండే పొటాషియం, పిండి పదార్థాలు బీపిని అదుపులో ఉంచుతాయి. కనుక గుండె ఆరోగ్యం బావుంటుంది.

జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి అవసరమయ్యే ఫైబర్ ఉండడం వల్ల బలబద్దకం నివారిస్తుంది.

చిలగడదుంపల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కీళ్లనొప్పులు, కీళ్లలో వచ్చే స్టిఫ్ నెస్ ను నివారిస్తుంది.

విటమిన్ ఎ వల్ల కంటి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. చిలగడ దుంపల్లోని విటమిన్ సి ఓవరాల్ హెల్త్ కి అవసరం.

Images credit : Pexels