చలికాలంలో పొడి గాలి వల్ల జుట్టుకు నష్టం జరుగుతంది. తలలో చుండ్రు కూడా పెరుగుతుంది.

క్రమం తప్పకుండా చేసుకునే మసాజుల వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. అందువల్ల స్కాల్ప్ ఆరోగ్యం బావుంటుంది.

బిగుతుగా ఉండే టోపిలు ధరిస్తే రక్తప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. శాలువా లేదా స్కార్ఫ్ ధరించడం మంచిది.

హీటింగ్ స్టయిలింగ్ డివైజుల వల్ల జుట్టు మరింత పొడి బారుతుంది. కనుక చలికాలంలో ఇలాంటి స్టయిలింగ్ వీలైనంత తగ్గించుకోవాలి.

శీతాకాలపు పొడి గాలి జుట్టును పొడిబారేలా చేస్తుంది. మంచి కండీషనర్ లను వాడడం అవసరం.

పోషకాలు కలిగిన సమతుల ఆహారం తీసుకోవడం అవసరం. ఓమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు, విటమిన్లు జుట్టు ఆరోగ్యానికి అవసరం.

చలికాలంలో స్టయిలింగ్ ప్రొడక్ట్స్ వాడకం తగ్గించాలి. వీటి వల్ల చుండ్రు సమస్య పెరుగుతుంది.
Images courtesy : Pexels