వారానికి 150 నిమిషాల తీవ్రమైన వర్కవుట్ చెయ్యడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఒక గంట పాటు ఈత కొట్టడం వల్ల ఎముకలు కీళ్ల మీద పెద్దగా భారం పడకుండా ఎక్కువ క్యాలరీలను ఖర్చు చెయ్యడం సాధ్యమవుతుంది.

ఈతతో ఒత్తిడి లేకుండా హృదయ స్పందన రేటు పెంచవచ్చు. కండరాలను టోన్ చెయ్యవచ్చు. శరీరం శక్తి సంతరించుకుంటుంది.

శ్వాసవ్యవస్థ బలంగా అవుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుతుంది. అస్తమాతో బాధ పడేవారికి మంచి ఆప్షన్.

ఈత సాధన చేసేవారిలో నొప్పి, గాయాల నుంచి త్వరగా కోలుకుంటారు. ఆర్థరైటిస్ వంటి సమస్యలకు ఈత మంచి వర్కవుట్

ఈతతో ఎక్కువ మొత్తంలో క్యాలరీలు ఖర్చుచెయ్యవచ్చు. నిద్ర సమస్యలు ఉన్నవారికి ఈత మంచి పరిష్కారం.

డిప్రేషన్, టెన్షన్ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి మూడ్ బాగుచేసేందుకు ఈత బాగా ఉపయోగకరం.

అన్ని వయసుల వారు, స్త్రీలు, పురుషులు, గర్భిణులు ఎవరైనా ఈత కొట్టవచ్చు. ఈత వర్కవుట్ మాత్రమే కాదు, ఒక సరదా ఆట కూడా.

Images courtesy : Pexels