పల్లీలు గా పిలుచుకునే వేరుశనగ పప్పులో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి తినడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం.

పల్లీలు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

పల్లీల్లో ప్రొటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి కండరాలు, ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం.

చలికాలంలో ఫ్లూవంటి ఇన్ఫెక్షన్లు చాలా త్వరగా అంటుకుంటాయి. పల్లీలు నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

పల్లీలు అందరి కిచెన్ లో అందుబాటులో ఉంటాయి. స్నాక్ గా తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. పల్లీలు తింటే మూడ్ బాగవుతుంది.



పల్లీలతో మెదడు పనితీరు మెరుగవుతుంది. చురుకుగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.

పల్లీలు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గేందుకు ఉపకరిస్తాయి. పల్లీలు తరచుగా తీసుకుంటే గుండె సమస్యలను నివారిస్తుంది.

తరచుగా పల్లీలు తింటుంటే శరీరం ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.

పల్లీల్లో ఉండే విటమిన్ ఇ వల్ల చల్లని వాతావరణంలో సైతం చర్మం తేమను నిలిపి ఉంచుకుంటుంది.



Images courtesy : Pexels