ఈ మధ్య బరువు తగ్గాలని కోరుకునే వారి సంఖ్యే ఎక్కువ. త్వరగా బరువు తగ్గేందుకు కొన్ని డైట్ ప్లాన్స్ తెలుసుకుందాం.

ఎటువంటి డైట్ ప్లాన్ ను అనుసరించినా సరే సోడియం, కొవ్వులు తగ్గించి తీసుకోవాలి. కొన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి.

పోర్షన్ కంట్రోల్ కూడా చాలా ముఖ్యమైన విషయం. సరిగ్గా సరిపడినంత పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం అవసరం.

వీలైనంత వరకు భారతీయ వంటలే తినాలి. ఇందులో అన్ని రకాల గింజలు, కూరగాయలు అన్నీ ఉంటాయి.

భారతీయ క్యుసిన్ లో కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రొటీన్ పెంచి తీసుకుంటే త్వరగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

రెండు భోజనాల మధ్య తగినంత విరామం ఉండడం చాల అవసరం. ఈ విరామమే బరువు తగ్గేందుకు దోహదం చేసేది.

కొద్దిపాటి ఆలివ్ ఆయిల్, గింజల వంటివి చేర్చితే శరీరం శక్తి సంతరించుకుంటుంది. బరువు కూడా తగ్గొచ్చు.

సరిపడినంత మాత్రమే తినాలి. అలా తిన్నప్పుడు తీసుకుంటున్న ఆహారంతో శరీరానికి మంచి అనుబంధాన్ని ఏర్పరుచుకుంటుంది.

ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలి.

బరువు తగ్గాలని అనుకున్నంత కాలం ఈ జాగ్రత్త తప్పక పాటించాలి.
Images courtesy : Pexels