ఇటీవలీ కాలంలో వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగిందనడంలో అనుమానం లేదు. టీనేజీ పిల్లల్లో ఫోన్ టైమ్ పెరగడం వల్ల రకరకాల శారీరక, మానసిక సమస్యలకు కారణం అవుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగం పిల్లల ఆరోగ్యం మీద చూపుతున్న ప్రభావం గురించి ఇక్కడ తెలుసుకుందాం. నాలుగు గంటలకు మించి ఫోన్ వాడే టీనేజర్లలో ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు, మాదకద్రవ్యాల వాడకం వంటివి పెరిగాయట. ఒకటి రెండు గంటలు మాత్రమే ఫోన్ వాడుతున్న పిల్లల్లో ఈ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నట్టు నిరూపితమైంది. స్క్రీన్ టైమ్ ఎక్కువుండే వారిలో నిద్ర సమస్యలు, కంటి సమస్యలు, మస్కిలో స్కెలిటల్ సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. పిల్లల్లో స్క్రీన్ టైమ్ అవగాహన పెంచే కార్యక్రమాలు విద్యాసంస్థల్లో నిర్వహించాలని నిపుణుల సూచన. Images courtesy : Pexels