గప్ చుప్, గోల్గప్పా అని ముద్దుగా పిలుచుకునే పానీ పూరి మనదేశపు గ్రేట్ స్ట్రీట్ పూడ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తం.

గోల్ గప్పాల ప్రస్తావన మహా భారతంలోనూ ఉందట. ద్రౌపది తన టాలెంట్ నిరూపించేందుకు మొదటగా ఇవే చేసి పెట్టిందట.

పానీపూరీ స్ట్రీట్ పూడ్ మాత్రమే కాదు దీనితో బరువు తగ్గొచ్చని న్యూట్రిషనిస్టులు అంటున్నారు.

గప్ చుప్ లు తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. ఇందులో మీఠా చేర్చకుండా తినాలి. డయాబెటిక్స్ ఆనందంగా దీన్ని ఆస్వాదించవచ్చు.

పానీపూరిల్లో ఐరన్, మెగ్నీషీయం, మాంగనీస్, పొటాషియం, ఫోలెట్, జింక్, విటమిన్లు ఉంటాయి.

నోటి పూతను తగ్గించే జల్జీరా, పుదీనా పానీ పూరిలో ఉంటాయి.

మిడ్ నైట్ స్నాకింగ్ కి పానీ పూరి మంచి ఆప్షన్. జల్జీరా అసిడిటీ మీద ప్రభావం చూపుతుంది.

పానీపూరిలోని పానీలో ఉండే పుదీనా, పచ్చిమామిడి, నల్ల ఉప్పు, మిరియాలు, జీలకర్ర, ఉప్పు అన్నీ కూడా అసిడిటీ తగ్గించేవే.

కాలంతో సంబంధం లేకుండా పానీపూరిలోని మసాలాలు మానసిక స్థితిని మెరుగు పరుస్తాయి.

డీహైడ్రేట్ కాకుండా కాపాడుతాయి పానీ పూరీలు.

ఇక ఆనందంగా పానీపూరీలు లాగించేయ్యొచ్చు. అయితే వీధిలో కాకుండా ఇంట్లో చేసుకుని తినాలట.
Images courtesy : Pexels