ఈ మధ్య సెలబ్రిటీలంతా ఐస్ డిప్ గురించి వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేస్తున్నారు.

సమంత, నేహా శర్మ లాంటి వారు ఈ మధ్యే వారి ఐస్ బాత్ పోస్టులు పెట్టారు. మరి, ఐస్ బాత్‌తో కలిగే ప్రయోజనాలేమిటో చూద్దామా.

రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటే హెల్త్ బాగుంటుంది. ఐస్ బాత్ తో శరీరంలో రక్తం, ఆక్సిజన్ ప్రసరణ మెరుగవుతుంది.

ఐస్ బాత్ ద్వారా ఎండార్ఫిన్ హార్మోన్లు విడుదలవుతాయి. అందువల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం దొరుకుతుంది.

ఐస్ బాత్ తో బరువు తగ్గవచ్చు. జీవక్రియ కూడా మెరుగవుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

క్రయోథెరపీగా పిలిచే కోల్డ్ వాటర్ థెరపి కండరాల నొప్పి తగ్గిస్తుందని విశ్వాసం

చల్లని నీరు రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది.

చల్లని నీటితో స్నానం చెయ్యడం వల్ల ఇమ్యూనిటి మెరుగుపడుతుంది.

సెరిబ్రల్ స్ట్రోక్, చర్మం పైన గాయాలు, హైపర్ థెర్మియా, జలుబు వంటి సమస్యలు ఉంటే ఐస్ బాత్ అంత మంచిది కాదట

Images courtesy : Pexels