టీ తాగితే నల్లగా అయిపోతారా?



పని భారం ఎక్కువైనప్పుడు, తలనొప్పి పెడుతున్నప్పుడు టీ తాగుతూ ఉంటారు. ఇలా ప్రతిసారి చిన్న చిన్న సమస్యలకు కూడా టీ తాగే వాళ్లు ఉన్నారు.



చాలా మందికి టీ తాగడం వల్ల చర్మం నల్లబడుతుందని అభిప్రాయం ఉంది. ఇది నిజమో కాదో చెబుతున్నారు సౌందర్య నిపుణులు.



టీ తాగడం వల్ల చర్మం రంగు తగ్గుతుంది అనేది కేవలం ఒక అపోహ. చర్మం రంగు టీ వల్ల మారదు.



టీ, కాఫీలు వంటివి అధికంగా తాగడం వల్ల అందులో ఉండే కెఫిన్ చర్మం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.



ఆ కెఫీన్ చర్మం ముడతలు పడేలా, గీతలు పడేలా చేస్తుంది. దీనివల్ల చర్మం తాజాదనాన్ని కోల్పోయి వయసు పైబడినట్టు కనిపిస్తుంది.



అందుకే టీ, కాఫీలను అధికంగా తాగుకూడదు. వీటిని అధికంగా తాగితే చర్మం త్వరగా ముసలిదైపోతుంది.



టీ తక్కువగా తాగడం వల్ల మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.



క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.