దంపుడు బియ్యంతో బరువు తగ్గుతారా? తెల్ల బియ్యంతో పోలిస్తే దంపుడు బియ్యం ఎన్నో పోషకాలను అందిస్తాయి. బియ్యం పైన ఉండే పొట్టులో ఎన్నో విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. దంపుడు బియ్యాన్ని ఒకసారి మాత్రమే పాలిష్ పెడతారు. దీనివల్ల పైన ఉన్న తొక్క పోతుంది. కానీ మిగతా పోషకాలు, ఖనిజాలు అలానే ఉంటాయి. ఒక పూట తెల్ల బియ్యాన్ని, మరో పూట దంపుడు బియ్యాన్ని తిని చూడండి. మధుమేహం వచ్చే ముప్పు 16% వరకు తగ్గే అవకాశం ఉంది. దంపుడు బియ్యం తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. ఇతర ఆహారాలను తినాలనిపించదు. కాస్త అన్నాన్ని తింటే చాలు పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి దంపుడు బియ్యం చాలా మంచి ఎంపిక. ఈ బియ్యాన్ని తిన్నాక జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా ఒకేసారి పెరగవు. మధుమేహం ఉన్నవారు తెల్ల బియ్యానికి బదులుగా పూర్తిగా దంపుడు బియ్యం తినేందుకు ప్రయత్నించాలి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు కూడా ఎక్కువే. కాబట్టి రొమ్ము క్యాన్సర్ వంటివి కూడా రాకుండా ఉంటాయి.