పిరయడ్‌కు ముందు ప్రిమెన్సువల్ సిండ్రోమ్, ప్రిమెన్సువల్ డైస్పోరిక్ డిజార్డర్ వల్ల మెదడు పనితీరులో మార్పు వస్తుంది. ఈ డిజార్డర్‌కు కారణం హార్మోన్లలో మార్పులు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ స్థాయిలలో మార్పులు సెరోటినిన్ వంటి న్యూరోట్రాన్స్ మీటర్లను ప్రభావితం చేస్తుంది. అందువల్ల రోజు వారీ పనులు, జ్ఞాపకశక్తి మీద ప్రభావం చూపుతుంది. చాలామందిలో నిద్ర కూడా తగ్గిపోతుంది. నిద్ర లేమి వల్ల అలసట ఎక్కువై మెదడు పని నెమ్మదిస్తుంది. చాలా మందిలో నిద్ర కూడా తగ్గిపోతుంది. నిద్రలేమి వల్ల అలసట ఎక్కువై మెదడు పని నెమ్మదిస్తుంది. చికాకుగా ఉండడం, బలహీనమైన భావోద్వేగాల వల్ల కూడా మెదడు పనితీరు నెమ్మదిస్తుంది. పీరియడ్ సమయంలో పెరిగిన ఒత్తిడి, యాంగ్జైటీ మెదడు పని తీరు మీద ప్రభావం చూపుతుంది. కొంతమంది శరీరంలో నీరు చేరుతుంది. ఇది అసౌకర్యంగా ఉండడం మాత్రమే కాదు మెదడు పనితీరు మీద కూడా ప్రభావం చూపుతుంది. Representational Image : Pexels