కొంతమంది పుట్టగొడుగులను చాలా ఇష్టంతో తింటారు. మరి, అవి ఆరోగ్యానికి మంచివేనా, ప్రయోజాలేమిటీ?

పుట్టగొడుగుల్లో 90 శాతం నీరే ఉంటుంది. కాలరీలు చాలా తక్కువ. హాఫ్ కప్ పుట్టగొడుగులతో కేవలం 3 క్యాలరీలు మాత్రమే అందుతాయి.

బీటా గ్లూకగాన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి తీసుకుంటే కోలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇమ్యూనిటి పెరుగుతుంది.

బీకాంప్లెక్స్ విటమిన్లు పుట్టగొడుగుల్లో అధికం. ముఖ్యంగా థయామిన్, రిబోఫ్లావిన్ పుష్కలంగా ఉంటాయి.

వెజిటేరియన్లు, మరేదైనా కారణంతో మాంసాహారానికి దూరంగా ఉంటున్నవారికి మంచి ప్లాంట్ బేస్డ్ ప్రొటిన్ అందించే పదార్థాలు.

మెదడు ఆరోగ్యానికి ఎంతో అవసరమయ్యే విటమిన్ బి6 ఉండడం వల్ల మానసిక సమస్యలతో బాధపడే వారికి మేలు చేస్తుంది.

ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్నవారికి తరచుగా పుట్టగొడుగులు ఇస్తే మంచి గుణం కనిపిస్తుంది.

పుట్టగొడుగుల్లో బీటా కెరాటిన్ వల్ల కంటి చూపు కూడా మెరుగవుతుంది.

పుట్టగొడుగులు తరచుగా తీసుకుంటే క్యాన్సర్ ను నివారించవచ్చు .