వారానికోసారి బొప్పాయి తినండి చాలు



చాలా మందికి బొప్పాయి పండు నచ్చదు. కానీ తినాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు.



బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకు చాలా అవసరమైనవి. ఇవి ఫ్రీ రాడికల్స్ ను అడ్డుకుంటాయి.



బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది మన జుట్టుకు, చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది.



బొప్పాయిని వారం రోజులకు ఒకసారైనా కప్పు నిండా తినాలి.



ప్రతి బొప్పాయి తింటే అందం ఇనుమడిస్తుంది. చర్మం సున్నితంగా, కాంతి వంతంగా మారుతుంది.



శీతాకాలంలో బొప్పాయి తింటే పెదాల పగుళ్లు రాకుండా ఉంటాయి.



రక్తహీనత ఉన్న వారు బొప్పాయిని తినడం వల్ల మంచి లాభం ఉంటుంది.



బొప్పాయి ద్వారా విటమిన్ సి శరీరానికి అధికంగా అందుతుంది.