స్ట్రోక్ రెండు రకాలు.. ఇస్కిమిక్ స్ట్రోక్, హేమరేజిక్ స్ట్రోక్. రాత్రిపూట కనిపించే కొన్ని లక్షణాలు స్ట్రోక్‌ను ముందే చెప్పేస్తాయి. ముఖం, కాలు, చెయ్యి, లేదా శరీరంలో ఏదో ఒక వైపు అకస్మాత్తుగా బలహీనంగా అనిపిస్తుంది. లేదా తిమ్మిరిగా అనిపిస్తుంది. అకస్మాత్తుగా గందరగోళం ఏర్పడుతుంది. రాత్రిపూటే కాదు.. రోజు కనిపించే కొన్ని లక్షణాలు కూడా పక్షవాతానికి సంకేతాలు కావచ్చు. చూపులో తేడా వస్తుంది. రెండు లేదా ఒక కంటిలో చూపు తగ్గవచ్చు. మాట్లడటం లేదా అర్థం చేసుకోవడంలో సమస్యలు ఏర్పడినా సరే.. పక్షవాతానికి సంకేతంగా భావించారు. నడవడం, బ్యాలెన్స్ డ్ గా ఉండడం, సమన్వయ పరచడం కష్టంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా తలనొప్పి, ఆకస్మికంగా కళ్లు తిరగడం. ఆకస్మికంగా ఛాతి నొప్పి రావచ్చు. శరీరం పై భాగంలో నొప్పి రావచ్చు. Representational Image : Pexels