సోడాతో నింపే కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం. వాటికి బదులు ఆరోగ్యాన్ని అందించే ఈ పానీయాలు తాగండి. ద్రాక్ష రసం: ఇందులో రెస్వెరాట్రాల్ అనే పోషకం ఉంటుంది. ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుంది. గ్రీన్ టీలో కాటెచిన్ అనే పాలీఫెనాల్ ఉంటుంది . గ్రీన్ టీలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాఫీ చాలా మందికి నచ్చుతుంది. ఇందులో గ్లూటాథియాన్ అనే యాంటి ఆక్సిడెంట్ ఉంటుంది. కాలేయ ఆరోగ్యానికి మంచిది. నిమ్మలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. నిమ్మరసంతో చాలా రకాల కాలేయ సమస్యలు నివారించవచ్చు. బీట్ రూట్ రసంలో పోషకాలు ఎక్కువ. నైట్రేట్స్, బీటా ఆక్సిడెంట్స్ వంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. సహజ ఎలక్ట్రోలైట్లతో కొబ్బరి నీళ్లు అమృతం వంటివి. వీటిలో ఉంటే పొటాషియం స్థాయిలు బీపిని అదుపులో ఉంచుతాయి. Representational Image : Pexels