కిడ్నీ ఆరోగ్యానికి తగినన్ని నీళ్లు తాగడం అవసరం అని అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు 8-10 గ్లాసుల నీళ్ల తాగాలని సూచనలు ఉన్నాయి. అయితే కిడ్నీ ఆరోగ్యానికి ఇన్ని నీళ్లు తాగాల్సిందేనా? నిపుణులు ఏమంటున్నారు? హైడ్రేటెడ్‌గా ఉండడం కేవలం కిడ్నీ ఆరోగ్యానికి మాత్రమే కాదు శరీరంలో జీవక్రియలన్నీంటికీ అవసరమే. తగినన్ని నీళ్లు తాగడం వల్ల కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చు. తగినన్ని నీళ్లు తాగుతూ ఆటోసోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్ని వ్యాధిని తగ్గించుకోవచ్చు. అయితే సాధారణంగా రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి. వాతావరణ పరిస్థితులను అనుసరించి నీటి అవసరం మరి కాస్త పెరగవచ్చు. డయేరియా, గ్యాస్ట్రో ఎంటరైటిస్ సమస్యలున్నవారు తగినన్ని నీళ్లు తాగితే త్వరగా కోలుకోవచ్చు. Representational Image : Pexels