మస్కిటో రిపెల్లెంట్ స్ప్రేలు ఎంచుకునే సమయంలో పిల్లల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించని వాటిని ఎంచుకోవాలి.

ఆల్కహాల్ , కలర్స్, హానికారక రసాయనాలు లేని వాటిని ఎంచుకోవాలి.

ఈ జాగ్రత్తలు పాటించకపోతే రకరకాల శ్వాస, చర్మ సంబంధ సమస్యలు రావచ్చు.

దోమ కాటునుంచి పిల్లలను కాపాడుకోవడానికి యాంటీ మస్కిటో ప్యాచ్​లు లేదా ఫ్యాబ్రిక్ రోల్ ఆన్​లు వాడొచ్చు.

రోల్ ఆన్స్ ఎంచుకునే సమయంలో చర్మానికి, దుస్తులకు హాని చెయ్యని వాటిని ఎంచుకోండి.

పిల్లల కోసం దోమ తెరలను ఉపయోగించడం అన్నంటికంటే ఉత్తమం.

దోమతెర సౌకర్యవంతం మాత్రమే కాదు, సురక్షితం కూడా.

బయటకు వెళ్లే సమయంలో వీలైనంత మేర శరీరం పూర్తిగా కప్పి ఉండే దుస్తులు మాత్రమే పిల్లలకు ఉపయోగించాలి.