బచ్చలి వంటి ఆకుకూరలు డిన్నర్‌లో తింటే రకరకాల విటమిన్లు, ఖనిజలవణాలు యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. సాల్మన్ వంటి చేపల్లో ఒమెగా3 ఫాటీ ఆసిడ్లు ఉంటాయి. ప్రొటీన్ ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. క్వినోవా అన్నానికి మంచి ప్రత్యామ్నాయం. గ్లుటేన్ ఫ్రీ కూడా. జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది. బ్రకోలీలో ఫైబర్, విటమిన్లు C, K అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఈ కూరగాయ డిన్నర్‌లో తీసుకుంటే మంచిది. వెల్లుల్లి భోజనానికి రుచి పెంచడం మాత్రమే కాదు బీపీ కూడా అదుపు చేస్తుంది. చిక్కుళ్లు మంచి వెజిటబుల్ ప్రొటీన్, ఫైబర్. రకరకాల రూపాల్లో, రకాల్లో లభ్యమయ్యే వీటిని డిన్నర్ లో తీసుకుంటే మంచిది. ఫైబర్, విటిన్లు A, C, పోటాషియంతో ఉండే చిలగడదుంపలను బంగాళా దుంపలకు ప్రత్యామ్నాయంగా రాత్రి పూట తీసుకోవచ్చు. గ్రీక్ యోగర్ట్ రాత్రి పూట తీసుకుంటే ప్రొటీన్ అందడం మాత్రమే కాదు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది. Representational Image : Pexels