మాంసంతో ముప్పు తప్పదు మాంసాహార ప్రియులు ప్రపంచంలో అధికంగానే ఉన్నారు. నిజానికి మాంసాహారం వల్ల అనేక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. మాంసం అధికంగా తినేవారి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోతుంది. దీని వల్ల గుండె సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటును పెంచే అవకాశం మాంసానికి ఉంది. వారానికి ఒకసారి మాంసం తింటే చాలు. రోజూ తినాలనిపిస్తే 50 గ్రాములకు మించి తినకూడదు. ముఖ్యంగా మటన్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అధికంగా చేరుతుంది. మాంసాహారాలలో చేపలు ఆరోగ్యానికి మంచివి. వీలైనంతవరకు చేపలు తినేందుకే ప్రయత్నించాలి. చికెన్ వారానికి మూడు సార్లు తినడం వల్ల ప్రొటీన్ పుష్కలంగా శరీరానికి అందుతుంది.