కొందరు ప్రొటీన్ నేరుగా అందుతుందని గుడ్డును పచ్చిగా తాగుతుంటారు.

పచ్చిగుడ్డు తెల్ల సొన ద్వారా సాల్మోనెల్లా బ్యాక్టీరియా సంక్రమణ జరిగే ప్రమాదం ఉంటుందట.

సాల్మోనెల్లాతో జీర్ణవ్యవస్థలో సమస్యలు వస్తాయి.

గుడ్డును పచ్చిగా తీసుకుంటే ఎగ్ వైట్ ఇంజ్యూరీ అనే సమస్య వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గుడ్డులోని తెల్ల సొనలో అవిడిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది బయోటిన్ అనే బీకాంప్లెక్స్ విటమిన్ శోషణకు అడ్డుతగులుతుంది.

గుడ్డులోని తెల్లసొన పచ్చిగా తీసుకుంటే ఆహారం ద్వారా సంక్రమించే అనేక వ్యాధులకు ఆస్కారం ఉంటుందట.

గుడ్డు పచ్చిగా తీసుకుంటే శ్వాససంబంధ సమస్యలు, దగ్గు, గురక, జీర్ణ సమస్యలు, కడుపునొప్పి, అతిసారం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

చాలా అరుదుగా అనఫిలాక్సిస్ అనే తీవ్రమైన అలెర్జీ కూడా రావచ్చు.

ఇందులో శ్వాసలో ఇబ్బంది, లో బీపీ, గుండె దడ, స్పృహ కోల్పోవడం జరగవచ్చు.
Representational Image : Pexel