బాదాములలో విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్ఫరస్ తో పాటు ఇమ్యూనిటి పెంపొందించే ఇతర పోషకాలు కూడా ఉంటాయి.

చలికాలమంతా ఆరోగ్యంగా చురుకుగా ఉండేందుకు పిస్తా పప్పు దోహదం చేస్తుంది.

జీడిపప్పులో విటమిన్ ఇ ఎక్కువ. ఇది చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఖర్జూరాల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికం కనుక శీతాకాలంలో తప్పక తీసుకోవాలి. ఇవి శరీరం వెచ్చగా ఉంచుతాయి.

అక్రూట్ వల్ల కూడా శరీరం వెచ్చగా ఉంటుంది. కనుక చలి కాలం వీటిని తీసుకోవడం మంచిది.

కిస్మిస్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచి జుట్టు పెరిగేందుకు సహకరిస్తుంది.

కాపర్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి పోషకాలతో నిండి ఉండే అంజీర్ చలికాలంలో తీసుకోవడం అవసరం.

ఎండిన ఆల్బుకారాలు శరీరం వెచ్చగా ఉండేందుకు దోహదం చేస్తాయి. కనుక చలికాలంలో ఇవి తీసుకోవడం చాలా అవసరం.
Representational Image : Pexels