గ్రీన్ టీ ఇలా తాగకూడదు



ఎక్కువమంది కాఫీ, టీలు కన్నా గ్రీన్ టీని తాగడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎంతో సహాయపడుతుంది.



ఎంతో మందికి తెలియని విషయం గ్రీన్ టీ తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.



గ్రీన్ టీ తాగితే ఆరోగ్యకరమే, కానీ దాన్ని తాగాల్సిన సమయం వేరే ఉంది.



పొట్ట నిండా భోజనం చేశాక చాలామంది గ్రీన్ టీ తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది.



గ్రీన్ టీ తాగినప్పుడు గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. వేడిగా గ్రీన్ టీ తాగడం వల్ల శరీరానికి అందే లాభాలు చాలా తక్కువ.



ఎంతో మంది చేసే పని పరగడుపున ఖాళీ పొట్టతో గ్రీన్ టీ ను తాగేస్తూ ఉంటారు. ఇలా చేయడం చాలా తప్పు.



గ్రీన్ టీ ఆరోగ్యకరమైనదే అయినా... దీనిలో కూడా కెఫిన్ ఉంటుంది. కాబట్టి రోజుకు రెండు కప్పులు కన్నా తాగకుండా ఉండడమే మంచిది.



గ్రీన్ టీని ఆదరాబాదరగా తాగితే ఉపయోగం ఉండదు. చాలా రిలాక్స్‌గా కూర్చుని సిప్ చేస్తూ ఉండాలి.