విమానం ఎక్కుతున్నారా? మీ చర్మం జాగ్రత్త. ఎందుకంటే.. Representational Image : Pexels

తరచుగా విమాన ప్రయాణాలు చేసే వారు ఎక్కువగా UVA రేడియేషన్ కు గురవుతున్నారని ఒక అధ్యయనం తెలిపింది.

విమానం, కిటికీలు, విండ్ షీల్డ్ లు UVB కిరణాలకు అడ్డుకోగలవు. కానీ UVA కిరణాలను అడ్డుకోలేవు.

UVB వడదెబ్బకు కారణం కాగలవు, UVA వల్ల స్కిన్ చర్మం ఏజింగ్‌కు గురవ్వుతుంది.

ఈ రెండు రకాల కిరణాలు క్యాన్సర్ ను కలిగించవచ్చు.

30 వేల అడుగుల పైన ఎగురుతున్నపుడు సూర్య రశ్మి తీక్షణంగా ఉండి వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఎక్కువగా విమాన ప్రయాణాల్లో ఉండే ఫ్లయిట్ అటెండెంట్స్ తప్పకుండా చర్మ సంరక్షణ మీద ఎక్కువ దృష్టి పెడతారట.

విమాన సిబ్బంది తరహాలోనే మీరు కూడా చేతులు పూర్తిగా కప్పి ఉండే దుస్తులు ధరించడం మంచిది.

కిటికి సీట్ లో కూర్చునే ప్రయాణికులు విండ్ షేడ్స్ మూసి ఉంచుకోవడం మంచిది.

బాడీ లోషన్, సన్ స్క్రీన్ లలో ఎస్ పీ ఎఫ్ 50 ఉండే లా జాగ్రత్త పడాలి.