కుంకుమ పువ్వు తింటే పిల్లలు తెల్లగా పుడతారా?



కుంకుమ పూవు ఖరీదైన సుగంధ ద్రవ్యం. దీని చుట్టూ ఎన్నో నమ్మకాలు ఉన్నాయి.

గర్భిణులకు ఎంతో మంది కుంకుమ పూవు రేకలను బహుమతిగా ఇస్తుంటారు.

గర్భిణిగా ఉన్నప్పుడు కుంకుమ పూరేకులు తినడం మంచిదే. ఇందులోని ఔషధ గుణాలు కాబోయే తల్లికి, గర్భస్థ శిశువుకు చాలా అవసరం.

కానీ ఇది రంగును నిర్ణయిస్తుందని మాత్రం శాస్త్రీయంగా నిరూపణ కాలేదు.

బిడ్డ రంగును నిర్ణయించేవి తల్లి, తండ్రి నుంచి వచ్చిన జన్యువులే.

జన్యువులు ఏ రంగును ఇస్తాయో ఆ రంగే బిడ్డకు వస్తుంది. కుంకుమ పూరేకులు రంగుని నిర్ణయించలేవు.

గర్భిణులు కుంకుమ పూల రేకలు తినడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.

ఈ హార్మోన్ తల్లిని సహజప్రసవానికి సిద్ధం చేస్తుంది.