పనీర్ అధికంగా తింటే ఈ సైడ్ ఎఫెక్టులు తప్పవు

శాకాహారులే కాదు పనీర్ వంటకాలకు మాంసాహారులు కూడా అభిమానులే.

విరగ్గొట్టిన పాలతో చేసే పనీర్లో కాల్షియం, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని కాటేజ్ చీజ్ అని కూడా పిలుస్తారు.

మితంగా తింటే జీర్ణవ్యవస్థకు మేలు చేసే పనీర్, అతిగా తినడం వల్ల అదే జీర్ణ వ్యవస్థకు హాని చేస్తుంది.

అధికంగా తింటే పొట్ట ఉబ్బరం కలుగుతుంది. దీనివల్ల గుండెల్లో మంట, కడుపునొప్పి వంటివి కలుగుతాయి.

పనీర్ అధికంగా తినేవారు త్వరగా బరువు పెరుగుతారు.

పాలు కొందరికి పడవు. అలాంటివారికి పనీర్ కూడా పడకపోవచ్చు.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకూడదు. అందుకు పనీర్ అధికంగా తినకూడదు.

పనీర్ తిన్న తరువాత వికారంగా అనిపించి వాంతులు కావడం, చర్మంపై పగుళ్లు, దద్ధుర్లు రావడం జరిగితే వెంటనే తినడం ఆపేయండి.