దీపావళికి సింపుల్‌గా బాసుంది స్వీట్

క్రీమ్ తీయని పాలు - ఒక లీటరు
చక్కెర - ముప్పావు కప్పు
తరగిన బాదం, పిస్తాలు - మూడు స్పూన్లు
యాలకుల పొడి - అరస్పూను
గులాబీ రేకలు - కొంచెం

మందపాటి గిన్నెలో పాలు వేసి స్టవ్ మీద పెట్టాలి.

చిన్న మంట మీద అలా గంట పాటూ మరిగిస్తే కాస్త రంగు మారుతాయి పాలు.

అంచులకు అంటుకున్నది కూడా గరిటెతో తీస్తూ పాలు మరిగిస్తూ ఉండాలి.

ఇప్పుడు అందులో పంచదార కలపాలి. మళ్లీ తక్కువ మంట మీద కనీసం అరగంట పాటూ మరిగించాలి.

అందులో యాలకుల పొడిని కూడా వేయాలి.

అలా పావుగంట సేపు మరిగాక స్టవ్ కట్టేయాలి.

పైన బాదం, పిస్తాలు, గులాబీ రేకలు తరిగి చల్లాలి. టేస్టీ బాసుంది రెడీ అయినట్టే.